January 22, 2025

చెన్నపురి దేవాంగ సంఘం నిర్వహణలోని శ్రీ కపిల వినాయక దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శివునికి అన్నాభిషేకం

చెన్నై న్యూస్: చెన్నై పాత చాకలి పేటలోని చెన్నపురి దేవాంగ సంఘం నిర్వహణలో కొనసాగుతున్న శ్రీ కపిల వినాయక దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శివునికి అన్నాభిషేకాన్ని వైభవోపేతంగా నిర్వహించారు.
కార్తీకమాసంలో ప్రతి ఏటా ఆలయంలో వైభవంగా అన్నాభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. అన్నాలంకృతుడైన శివుణ్ణి దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.విశాలాక్షి అమ్మవారిని పండ్లతో ,అలాగే ఉత్సవ మూర్తులను కనువిందుగా అలంకరించి ప్రత్యేక పూజలుచేశారు. అనంతరం సంప్రదాయబద్ధంగా రుద్రాభిషేకాన్ని నిర్వహించారు.శుక్రవారం రాత్రి 7 గంటలకు పైగా అన్నాభిషేకం పూజలను చేపట్టారు. అనంతరం శివుణ్ణి అన్నంతో దివ్య సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తర్వాత మహాశివునికి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. రాత్రి 10 గంటల తరువాత శివునికి అన్నాభిషేకం చేసిన అన్న ప్రసాదాన్ని భక్తులకు అందించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు పోదల విఎస్ కృష్ణమూర్తి,పొన్నూరి రాధాకృష్ణన్, సంఘ అధ్యక్షులు కె .కె. జనార్దనం, ఉపాధ్యక్షులు తారా చంద్ తోపాటు మన్ని వెంకటేశ్వర్లు, సోమ సుందరం,భరణీ,ముని రత్నం.లక్ష్మీ కాంతం తోపాటు జక్కుల హరికృష్ణ, వందలాదిమంది భక్తులు పాల్గొని శివ పరమాత్మని కృపకు పాత్రులయ్యారు.ఆలయానికి వచ్చిన భక్తులు చెన్నపురి దేవాంగ సంఘం చేస్తున్న సేవలను ప్రసంశించారు.

..

About Author