చెన్నైన్యూస్:తెలుగు వెలుగు సంక్షేమ సంఘం మరోసారి గొప్ప మనస్సును చాటుకున్నారు.ఎయిడ్స్ వ్యాధి అంటేనే చాలా మంది భయపడి, ఆ వ్యాధి సోకిన వారి దగ్గరకు వెళ్లాలంటే సంకోసిస్తారు, అలాంటిడి ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు స్వయంగా తన చేతులతో ఆహారం తినిపించి తనలోని గొప్ప మనస్సును చాటుకున్నారు. చెన్నై అంబత్తూర్ లో ఎయిడ్స్ వ్యాధి సోకిన చిన్నారుల ఆశ్రమాన్ని అల్లింగం రాజశేఖర్ సందర్శించారు. అక్కడ ఉంటున్న ఎయిడ్స్ సోకిన చిన్నారులు చూసి తన
హృదయం చెల్లించిపోయింది. వారితో ఎంతో ఆప్యాయంగా పలకరించి, తానే స్వయంగా కూరలతో కలిపిన అన్నంను చిన్నారులకు తినిపించి మానవత్వాన్ని చాటుకున్నారు.వారికి ధైర్యాన్ని చెబుతూ నేనున్నాను అన్న భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా అల్లింగం రాజశేఖర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి సంతోషంగా ఉండాలంటే కావలసింది ఆస్తులు అంతస్తులు కాదన్నారు. కష్టాల్లో ఉన్నవారికి నేనున్నానని చెప్పే వాళ్ళు ఉంటే వారి జీవితం అంతా సంతోషంగా ఉంటుందన్నారు.అలాగే మనం ఆనందంగా ఉంటే మన జీవితం బాగుంటుంది. కానీ మన వల్ల ఇతరులు ఆనందంగా ఉంటే మన జీవితం గొప్పగా , సంతృప్తికరంగా ఉంటుందన్నారు.ఎయిడ్స్ వ్యాధి సోకిన వారితో మాట్లాడితే మనకు సోకుతుందన్న భయాన్ని వదలాలి అని ఆయన విజ్ఞప్తి చేశారు.ఎయిడ్స్ చిన్నారులకు మానవతా దృక్పథంతో ప్రతీ ఒక్కరూ చేయుత నివ్వాలని కోరారు. ఈ
సందర్భంగా చిన్నారులు గోడలకు వేసిన ఆర్ట్స్, మట్టితో చేసిన బొమ్మలు కొన్ని చూపించగా ,వారి ప్రతిభను కొనియాడుతూ అభినందించారు.ఒక్కరోజు వారికి స్పెషల్ విందు ఏర్పాటు చేయటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అడయార్ కేన్సర్ ఆసుపత్రి లోని కేన్సర్ చిన్నారులకు కూడా తనవంతు సాయం అందించినట్టు అల్లింగం రాజశేఖర్ తెలిపారు.
ఎయిడ్స్ సోకిన చిన్నారులపై గొప్ప మనస్సును చాటుకున్న అల్లింగం రాజశేఖర్


More Stories
AMPA SKYONE MALL HOSTS “MAGICAL VOICES & VIBES” CELEBRATING INCLUSIVE MUSICAL TALENT
Chennai Teen Nisha Sasikumar Becomes Youngest Woman in the World to Summit Mount Everest from Nepal Side
మరపురాని మహామనిషి …ఎన్టీఆర్ -తమ్మినేని బాబు వ్యాఖ్య