చెన్నై న్యూస్: వలసరవాక్కం ఆర్యవైశ్య అసోసియేషన్ వార్షిక సర్వసభ్య సమావేశం జూన్ 15వ తేదీ ఆదివారం ఘనంగా జరిగింది.చెన్నై రామాపురం వళ్లువర్ సాలైలోని గాంగో కాంప్లెక్స్ వేదికగా జరిగిన ఈ సమావేశానికి అసోసియేషన్ కార్యవర్గసభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన , వాసవిమాత తో ఆరంభం అయిన ఈ కార్యక్రమానికి అసోసియేషన్ అధ్యక్షులు కె. నారాయణన్ అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా విద్యలో రాణిస్తున్న 10వ తరగతి, ప్లస్ టూ విద్యార్థులకు చేయూత నిస్తూ ఎడ్యుకేషన్ అవార్డులను అందజేశారు.

ఇందులో ఇద్దరు విద్యార్థులకు అసోసియేషన్ వ్యవస్థాపకులు కాకర్ల రామలింగం అవార్డును అందించగా, మరోఇద్దరు విద్యార్థులకు ఎన్ బి ఆర్ ప్రసాద్ అవార్డును ప్రదానం చేశారు. అంతకుముందు అసోసియేషన్ అధ్యక్షులు కె. నారాయణన్ సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడుతూ తమ అసోసియేషన్ వివిధ సేవా, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు పేద విద్యార్థుల విధ్యాభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. సమాజ సేవే పరమావధిగా ముందుకెళుతున్నాం అని తెలిపారు . తాము చేపట్టే వివిధ సేవా కార్యక్రమాల్లో కార్యవర్గ సభ్యులందరి సహకారం ఎంతో ఉందన్నారు.అనంతరం అసోసియేషన్ కార్యదర్శి ఆర్ .వి. ఎల్. రత్నకుమార్ కార్యదర్శి నివేదికను సమర్పించగా, కోశాధికారి టి నరసింహారావు కోశాధికారి రిపోర్టును చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో ఎంఎన్ అమరా నారాయణ స్వాగతోపన్యాసం చేయగా, కె ప్రభాకర్ వందన సమర్పణ చేశారు. ముందుగా చెన్నై సిస్టర్స్ నృత్య ప్రదర్శనలు, ఉదయ మిమిక్రీ అందరినీ ఆకట్టుకున్నాయి.
….


More Stories
‘Drug Free Tamil Nadu 1000 people participated in the Grand human chain rally.
శోభా రాజా నివాసంలో వైభవంగా వరలక్ష్మీ పూజలు
கோவையை அதிர விடும் போதைப்பொருள் மன்னன்… ஆளும் கட்சி ஆதரவில் அட்டூழியமா? – யார் இந்த அரவிந்த்?