
చెన్నై న్యూస్: భగవద్గీతలోని అంతరార్థాన్ని అర్ధం చేసుకుంటే ప్రతీ ఒక్కరి జీవితంలో అద్భుతమైన పరివర్తనలు వచ్చితీరుతాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలోని ట్రూత్ వివేకామృతం స్థాపకులు, భాష్యకర్త వివేకానంద ఉపదేశించారు. .ట్రూత్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్, ప్రపంచ తెలుగు సమాఖ్య (డబ్ల్యూటీ ఎఫ్) సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజులు పాటు చెన్నై నగరంలో ఆత్మజ్ఞానం ఉపన్యాసం, శిక్షణ తరగతులు విజయవంతంగా నిర్వహించారు.ఈ ఆధ్యాత్మిక సదస్సుకు గురువు శ్రీ వివేకానంద విచ్చేసి జ్ఞానం అంటే ఏమిటి, సత్యం అంటే ఏమిటీ అనే విషయాలను కూలంకుశంగా వివరించారు . జ్ఞానం అంటే ఆత్మచైతన్యం యొక్క సమగ్రమైన అవగాహననే జ్ఞానం అని పేర్కొన్నారు అలాగే సత్యం , జ్ఞానం అనేది తెలుసుకుంటే జీవితం ఎంతో బాగుంటుందని అన్నారు. ఈ ప్రపంచంలో జ్ఞానంతో సమానమైనది లేనేలేదని ఉపదేశించారు .అపారమైన భక్తి, జ్ఞానంతోనే భగవంతుడ్ని చూడవచ్చన్నారు.రెండు దశాబ్దాలుగా భగవద్గీత, గరుడ పురాణం తదితర గ్రంథాల్లోని సారాంశాన్ని సారభూతమైన అంశాలను అందరికీ ఉపదేశిస్తున్నట్టు తెలిపారు. ప్రతీ మానవడు భగద్గద్గీతను అర్థం చేసుకోవాలని సూచించారు. దానిని అర్థం చేసుకుంటే వారి జీవితాల్లో అద్భుతమైన పరివర్తనలు వచ్చి తీరుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా డబ్ల్యూ టీఎఫ్ ప్రదాన కార్యదర్వి శ్రీలక్ష్మీ మోహనరావు గురువు వివేకానందను ఘనంగా సత్కరించారు. ఇందులో నిర్వాహకులు సంధ్య, సాంబశివరావు ఇంకా ట్రూత్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్ కు చెందిన సుభాషిణిలులతోపాటు పెద్ద సంఖ్యలో మహిళలు. చిన్నారులు పెద్దలు పాల్గొన్నారు.


More Stories
‘Drug Free Tamil Nadu 1000 people participated in the Grand human chain rally.
శోభా రాజా నివాసంలో వైభవంగా వరలక్ష్మీ పూజలు
கோவையை அதிர விடும் போதைப்பொருள் மன்னன்… ஆளும் கட்சி ஆதரவில் அட்டூழியமா? – யார் இந்த அரவிந்த்?