March 7, 2026

ఘనంగా టామ్స్ సౌత్ చెన్నై జిల్లా ప్రెసిడెంట్ రొడ్డా జయరాజ్ 67వ జన్మదిన వేడుకలు

చెన్నై న్యూస్:సంఘ సేవకులు , టామ్స్ సౌత్ చెన్నై జిల్లా ప్రెసిడెంట్ రొడ్డా జయరాజ్ 67వ జన్మదిన వేడుకలను కోలాహలంగా జరుపుకున్నారు.కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, స్నేహితులతో కలసి కేక ను కట్ చేసే పుట్టినరోజు వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.

ముందుగా తమిళనాడు ఆది ఆంధ్ర అరుంధతీయ మహాసభ (టామ్స్) ఆధ్వర్యంలో టామ్స్ వ్యవస్థాపకులు గొల్లపల్లి ఇశ్రాయేలు అధ్యక్షతన చెన్నై నుంగంబాక్కంలో జనోదయం ప్రధాన కార్యాలయం వేదికగా రొడ్డా జయరాజు పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు
టామ్స్ ముఖ్య నాయకులు ఊటుకూరు దేవదానం, బంకా బాలాజీ, పాల్ కొండయ్య, రమాదేవి, ప్రసన్న కుమార్, మస్తాన్, రోశయ్య, దీనా తదితరులు పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే రొడ్డా జయరాజును శాలువాలతో ఘనంగా సత్కరించారు. అదేవిధంగా సెయింట్ థామస్ మౌంట్ లో జరిగిన వేడుకల్లో ఎయిర్ పోర్ట్ గోపి, సూరిపోగు రంగయ్య ,మాతంగి నరసయ్యలు
పాల్గొని రొడ్డా జయరాజుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి శాలువాలతో ఘనంగా సత్కరించారు. పల్లికరణై వద్ద మైలై బాలాజీ నగర్ టామ్స్ అధ్యక్షులు భూలోక పెంచలయ్య, తాళ్లూరిసుబ్బయ్య, సుబ్రమణి
, రమణయ్య, గిరి తదితరులు పాల్గొని రొడ్డా జయరాజుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి శాలువాలతో ఘనంగా సత్కరించారు.అలాగే వేళచ్చేరిలోని తన నివాసంలో కుటుంబ సమేతంగా కలసి కేక ను కట్ చేసే పుట్టినరోజు వేడుకలను రొడ్డా జయరాజ్ ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా గొల్లపల్లి ఇశ్రాయేలు మాట్లాడుతూ సమాజ సేవకు రొడ్డా జయరాజ్ ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు .పారిశుద్ధ కార్మికులకు ,అలాగే సమాజంలోని నిరుపేద వర్గాల వారికి టామ్స్ తరపున తనవంతుగా సహాయ పడుతున్నారని ఆయనను అభినందించారు.
అనంతరం తన పుట్టినరోజు వేడుకలును ఎంతో అభిమానంతో , ప్రేమతో ఘనంగా జరుపుకున్న కుటుంబ సభ్యులకు , స్నేహితులకు, టామ్స్ నిర్వాహకులకు రొడ్డా జయరాజ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు

About Author