చెన్నై న్యూస్:తమిళనాడు ఆర్యవైశ్య మహిళా సభ (మద్రాసు యూనిట్ ) ఆధ్వర్యంలో ఆడిమాసం మొదటి శుక్రవారాన్ని పురస్కరించుకొని శ్రీ రాజశ్యామలాదేవి పూజను అత్యంత వైభవంగా నిర్వహించారు.చెన్నై జార్జ్ టౌన్ లోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం మహా మండపం వేదిక అయింది . తమిళనాడు ఆర్యవైశ్య మహిళా సభ మహిళా సభ అధ్యక్షురాలు ప్రశాంతి సతీష్ అధ్యక్షతన ముందుగా దీపాన్ని, శ్రీ రాజశ్యామలా దేవిలను వివిధ రకాల పుష్పాలతో నేత్రపర్వంగా అలంకరించారు . శ్రీ రాజ శ్యామలా దేవికి పచ్చ రంగు ఎంతో ప్రీతీ అని, అందుచేత పచ్చని పండ్లను నైవేద్యంగా సమర్పించారు . దాదాపు 220 మందికి పైగా మహిళలు పాల్గొని శ్రీ రాజశ్యామలాదేవి పూజను భక్తిశ్రద్ధలతో చేపట్టారు. ఆలయ అర్చకులు దిలీప్ కుమార్ పంతులు మహిళలందరి చేత దీప పూజను ,శ్రీ రాజశ్యామలా దేవి పూజలను చేయించారు.

ముందుగా విఘ్నేశ్వరున్ని ఆరాధిస్తూ ఆరంభమైన ఈ పూజా కార్యక్రమం దాదాపు గంట పాటు సాగింది మహిళలంతా ఎంతో భక్తిశ్రద్ధల పూజలు చేసి ఆధ్యాత్మిక శోభను తెచ్చారు.ఈ సందర్భంగా అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. మహిళా సభ అధ్యక్షురాలు ప్రశాంతి సతీష్ మాట్లాడుతూ 1983వ సంవత్సరంలో ప్రారంభమైన తమ సంస్థ ప్రతీ ఆడిమాసం మొదటి శుక్రవారం రోజున శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో దీప పూజను చేస్తున్నట్టు తెలిపారు. రాజశ్యామలా దేవిని పూజించడం ద్వారా ఆర్థిక సమస్యలు,ఆరోగ్య సమస్యలు ఇతర సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని అంతే కాకుండా జ్ఞానం, ఐశ్వర్యం,రాజయోగం లభిస్తాయని అన్నారు.పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని శ్రీ రాజశ్యామలదేవి పూజను దిగ్విజయంగా నిర్వహించామని, అమ్మవారి ఆశీస్సులు అందరికీ మెండుగా లభించాలని ఆకాంక్షించారు. పూజల్లో పాల్గొన్న వారందరికీ అష్టోత్తరం దండకం పుస్తకాలను పంపిణీ చేశారు .ముందుగా పద్మలత వీణా వాయిద్య కచేరి వీణులవిందు చేయగా,శ్రీ రాజశ్యామల దేవి పై సంగీతదర్శకులు శ్రీనిబాబు రచించిన గీతాన్ని ఎనిమిది మంది మహిళా సభ్యులు కలసి శ్రావ్యంగా అలపించి అందరినీ అలరించారు.అలాగే విద్యార్థులకు స్కాలర్ షిప్ లను వితరణ చేశారు.
ఈ కార్యక్రమంలో మహిళా సభ కార్యదర్శి భార్గవి అశోక్ , కోశాధికారి ప్రసన్న లక్ష్మి తోపాటు మల్లికా ప్రకాష్ ఇంకా, కార్యవర్గ సభ్యులు, మాజీ అధ్యక్షులు ,మహిళ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
…


More Stories
AMPA SKYONE MALL HOSTS “MAGICAL VOICES & VIBES” CELEBRATING INCLUSIVE MUSICAL TALENT
Chennai Teen Nisha Sasikumar Becomes Youngest Woman in the World to Summit Mount Everest from Nepal Side
మరపురాని మహామనిషి …ఎన్టీఆర్ -తమ్మినేని బాబు వ్యాఖ్య