
చెన్నై న్యూస్: కలియుగ ప్రత్యేక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలను వైభవోపేతంగా నిర్వహించారు. తిరుమల తిరుపతిలో ప్రతిష్టాత్మకంగా జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వర స్వామి సేవా సమాజం ఆధ్వర్యంలో 4వ వార్షిక పురటాసి తొలి శనివారం వేడుకలను చేపట్టారు .ఈ సందర్భంగా చెన్నై షావుకారు పేటలోని కుమరప్ప మేస్త్రీ వీధిలో శ్రీవారికి ప్రత్యేక పూజలను అత్యంత వైభవంగా చేశారు ముందుగా శ్రీవారిని వివిధ రకాల పుష్పాలు, పండ్లుతో, మామిడి తోరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. సీనియర్ పురోహితులు వడ్డీ వెంకటేశ్వర్లు నేతృత్వంలో గణపతి పూజతో పూజలను ఘనంగా ప్రారంభించారు. అనంతరం శ్రీవారికి అర్చన, అలంకారం, హారతి, ప్రసాద నివేదనను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ పూజల్లో పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొని గోవిందా గోవిందా అంటూ గోవింద నామస్మరణలతో శ్రీవారి సేవలో తరించారు.భక్తులందరికీ శ్రీవారి దర్శనభాగ్యం కల్పించి స్వామివారి ఆశీస్సులను అందించారు. ఈ వేడుకలను శ్రీ వెంకటేశ్వర స్వామి సేవా సమాజం కార్యవర్గ సభ్యులు చక్కని ఏర్పాటు తోపాటు ఈ పూజల్లో పాల్గొన్న భక్తులందరికీ అన్నప్రసాదాలను పంపిణి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతీ ఏడాది పురటాసి తొలి శనివారాన్ని పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వర స్వామివారికి విశేషంగా పూజలు నిర్వహిస్తూ వస్తున్నామని అన్నారు. ఇక్కడ వ్యాపారాలు చేస్తున్న తెలుగు వారంతా కలిసి ఈ సమాజంను ఏర్పాటు చేసుకుని అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు శ్రీవారికి వైభవోపేతంగా పూజలు, అన్నదానాలు చేస్తామన్నారు. ఇది తమకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నట్టు తెలియజేశారు.సమాజం నిర్వాహకులు ఆకుల ఆదినారాయణ, సర్వేపల్లి మల్లిఖార్జున్, బాలు హేమంత్ కుమార్, కె.రవి, జి.అనిల్, టి .జి రమేష్ , సోమశేఖర్, ఎ .చరణ్, జి.శ్రీనివాసులు, పి.దయాకర్. పి.సతీష్ ,ఎం. సుబ్రమణ్యం, ఎన్.చంద్రు , ఎ.మురళి, పి.శేఖర్, బి.చంద్రశేఖర్, ఎ.దామోదరం, నోరు సుబ్రమణ్యం, వై.చంద్రశేఖర్, జి.వెంగయ్య తదితరులు పాల్గొన్నారు


More Stories
AMPA SKYONE MALL HOSTS “MAGICAL VOICES & VIBES” CELEBRATING INCLUSIVE MUSICAL TALENT
Chennai Teen Nisha Sasikumar Becomes Youngest Woman in the World to Summit Mount Everest from Nepal Side
మరపురాని మహామనిషి …ఎన్టీఆర్ -తమ్మినేని బాబు వ్యాఖ్య