చెన్నై న్యూస్: మాతృభాష పరిరక్షణ దిశగా తెలుగు వెలుగు సంక్షేమ సంఘం అధ్యక్షులు అల్లింగం రాజశేఖర్ అడుగులు వేస్తున్నారు. తెలుగు భాష గొప్పతనాన్ని చాటుతూ మాతృభాషలో విద్యను సాగించాలని తెలుగు కుటుంబాలను కోరుతున్నారు.చెన్నై నగరంలో తెలుగు వారు నివసించే ప్రదేశాలకు వెళ్లి తెలుగు విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ప్రోత్సహిస్తున్నారు. .వారానికి ఒకరోజు వెళ్లి విల్లివాక్కంలోని తెలుగు చిన్నారులకు టిఫిన్ బాక్స్ లు, తెలుగు పుస్తకాలు ,అలాగే వారి తల్లిదండ్రులకు నూతన వస్త్రాలు బహుకరిస్తున్నారు. అదే సమయంలో
.అమ్మభాషను ప్రేమిద్దాం… దేశబాషలందు తెలుగు లెస్స అని చాటి చెబుతున్నారు. తమ తమ పిల్లలను ఎప్పడూ ఇంగ్లీషులోనే చదవాలి, ఇంగ్లీషులోనే మాట్లాడాలి, ఇంగ్లీషు పుస్తకాలనే చదవాలని నిర్భందించవద్దుని అల్లింగం రాజశేఖర్ కోరుతున్నారు.వేమన పద్యాలు, సుమతీ శతకాలు చిన్నవయస్సులోనే నేర్పాలని, పూర్వం పెద్దబాలశిక్షను చదివి, లోకజ్ఞానంతో వెలుగొందిన మహనీయులు ఎందరో ఉన్నారని గుర్తుచేశారు.. తల్లిదండ్రులు, గురువులు ప్రోత్సహిస్తే ప్రతీ విద్యార్థి మాతృభాషలో విజయవంతంగా సాగుతారని తెలుగు వెలుగు సంక్షేమ సంఘం అధ్యక్షులు అల్లింగం రాజశేఖర్ వివరించారు.
..
మాతృభాష పరిరక్షణే లక్ష్యం-అల్లింగం రాజశేఖర్


More Stories
‘Drug Free Tamil Nadu 1000 people participated in the Grand human chain rally.
శోభా రాజా నివాసంలో వైభవంగా వరలక్ష్మీ పూజలు
கோவையை அதிர விடும் போதைப்பொருள் மன்னன்… ஆளும் கட்சி ஆதரவில் அட்டூழியமா? – யார் இந்த அரவிந்த்?