చెన్నై న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి , ప్రముఖ చలనచిత్ర నటులు నందమూరి తారక రామారావు 103 వ జయంతి ని తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం నిర్వహణలో చెన్నై పెరంబూర్ లో సాయంకాలం ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించి వారికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం అధ్యక్షులు తమ్మినేని బాబు, జనని ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య, సంఘం కార్యవర్గ సభ్యులు ఎం. కొండయ్య
స్మిత్ ఎం దవే, మొదలగువారు పాల్గొని వారి చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించి వారిపై తమకున్న ప్రేమాభిమానాలు చాటుకున్నారు.
ఈ సందర్భంగా తమ్మినేని బాబు మాట్లాడుతూ మరపురాని మహా మనిషి రామారావు గారి అని కొనియాడారు. వారు చలనచిత్ర రంగంలో మకుటం లేని మహారాజుగా చలామణి అయ్యారని అటువంటి నటుడు మన తెలుగువాడు కావడం తెలుగు వారందరికీ గర్వకారణమని చెప్పారు.గుడిమెట్ల చెన్నయ్య తమ ప్రసంగంలో జూలై 19, 1989 సంవత్సరంలో తమిళనాడులోని తెలుగు వారి సమస్యలపై వారితో ముచ్చటించేందుకు ముందస్తు అనుమతితో హైదరాబాదు వెళ్లాం అని. వారు మమ్ములను స్వాగతించిన తీరు, పలికిన పలుకులు మా సమస్యకు వెంటనే పరిష్కార సూచనలు విని మాకు ఎంతో ఆనందం కలిగింది.
ఆ హుందాతనం ,ఆ పలికే తీరులో నమ్రత మరపురానిది మరువలేనిది అని అన్నారు. అటువంటి మహానటుడని చూడడం వారితో మాట్లాడడం మాకు ఎంతో ఆనందం కలిగించింది అని తెలిపారు.
…
మరపురాని మహామనిషి …ఎన్టీఆర్ -తమ్మినేని బాబు వ్యాఖ్య


More Stories
‘Drug Free Tamil Nadu 1000 people participated in the Grand human chain rally.
శోభా రాజా నివాసంలో వైభవంగా వరలక్ష్మీ పూజలు
கோவையை அதிர விடும் போதைப்பொருள் மன்னன்… ஆளும் கட்சி ஆதரவில் அட்டூழியமா? – யார் இந்த அரவிந்த்?