
చెన్నై న్యూస్: విద్యతోనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని భారత ప్రభుత్వ ఫైనాన్స్ మంత్రిత్వశాఖ ఇన్ కంట్యాక్స్ కమీషనర్ (రెవెన్యూ విభాగం) ఎన్ .నందకుమార్ ఐఆర్ఎస్ అన్నారు .దివంగత విద్యావేత్త, రచయిత్రి డాక్టర్ మాజేటి జయశ్రీ స్మారకార్థం కొల్లిపర మాజేటి జయశ్రీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 4వ వార్షిక ఉపకారవేతనాల పంపిణీ కార్యక్రమం ఆదివారం చెన్నై ఎగ్మోర్లోని హోటల్ రమడాలో ఘనంగా జరిగింది.ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీలు డాక్టర్ M.S. చంద్రగుప్తా., M.తనూజా సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇన్ కంట్యాక్స్ కమీషనర్ N. నందకుమార్, గౌరవ అతిథిగా చెన్నై వేపేరి అసిస్టెంట్ పోలీసు కమీషనర్ కన్నన్ లు విచ్చేశారు. ఈ సందర్భంగా చెన్నై నగరంలోని తెలుగు పాఠశాలలు, కళాశాలల్లో 1వ తరగతి నుంచి పిహెచ్ వరకు చదువుతున్న 110 మంది నిరుపేద విద్యార్థిని విద్యార్థులకు ఉపకార వేతనాలను అతిథులు చేతులమీదుగా పంపిణీ చేశారు. అనంతరం నందకుమార్ ఐఆర్ఎస్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడితే చదివితే భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుదన్నారు. తన తల్లిపేరుతో ట్రస్టు ను ఏర్పాటు చేసి పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి పాటుపడుతున్న ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ చంద్రగుప్తా సేవలను ఈ సందర్భంగా ప్రసంశించారు. ముందుగా డాక్టర్ ఎంఎస్ చంద్రగుప్తా మాట్లాడుతూ తెలుగు భాషను పరిరక్షించాలని, తెలుగు విద్యార్థులు భాగా చదువుకోవాలన్న అమ్మ కలను నెరవేర్చేలా ఈ ట్రస్ట్ ను స్థాపించామని తెలిపారు. ప్రతీ ఏడాది విద్యార్థులకు స్కాలర్ షిప్ లను అందిస్తూ వస్తున్నామన్నారు. ఈ ఏడాది 110 మంది విద్యార్థులకు స్కాలర్ షిప్ లు అందించినట్టు వెల్లడించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించగా, ఈ కార్యక్రమంలో మాజేటి చక్రవర్తి అపర్ణ దంపతులు, ఇంకా హోటల్ రమడా డైరెక్టర్ ఆఫ్ సేల్స్ మోహన్ రాజ్ ,ఈవెంట్ మేనేజర్ దేవానంద్ షా , తెలుగు తరుణి అధ్యక్షురాలు K. రమణి ,మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ విస్తాలి శంకర రావు, తెలుగు వెలుగు అధ్యక్షులు అల్లింగం రాజశేఖర్, మల్లికా ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు


More Stories
‘Drug Free Tamil Nadu 1000 people participated in the Grand human chain rally.
శోభా రాజా నివాసంలో వైభవంగా వరలక్ష్మీ పూజలు
கோவையை அதிர விடும் போதைப்பொருள் மன்னன்… ஆளும் கட்சி ஆதரவில் அட்டூழியமா? – யார் இந்த அரவிந்த்?