
చెన్నై న్యూస్: తమిళనాడు ఆర్యవైశ్య మహిళా సభ (మద్రాస్ యూనిట్) ఆధ్వర్యంలో రోడ్ల పక్కన వ్యాపారాలు చేసుకుంటున్న చిరు వ్యాపారులకు గొడుగులను వితరణ చేశారు. బుధవారం సాయంత్రం చెన్నై టీ. నగర్ లోని తమిళనాడు ఆర్యవైశ్య మహిళా సభ మాజీ అధ్యక్షురాలు ఊరా శశికళ నివాసంలో ఈ సేవా సంక్షేమ కార్యక్రమాని చేపట్టారు. వర్షాకాలంలో, ఎండాకాలంలో ఉపయోగకరంగా ఉండే ఈ గొడుగులను తమిళనాడు ఆర్యవైశ్య మహిళా సభ నూతన చైర్ పర్సన్ ప్రశాంతి సతీష్, సెక్రటరీ భార్గవి అశోక్, ట్రెజరర్ ప్రసన్న పాల్గొని 15 మంది రోడ్డు ప్రక్కన వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారులకు వితరణ చేశారు ..ఈ సందర్భంగా ప్రశాంతి సతీష్ మాట్లాడుతూ తమిళనాడు ఆర్యవైశ్య మహిళా సభ అనేక సంవత్సరాలుగా వివిధ సామాజిక సేవా, ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తుందన్నారు. అందులో భాగంగా రోడ్డు పక్కన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వారికి గొడుగులను వితరణ చేసే ప్రాజెక్టును చేపట్టామని తెలిపారు .టి. నగర్ పరిసర ప్రాంతాల్లోని 15 మంది చిరు వ్యాపారులకు వీటిని అందించినట్లు తెలిపారు.అలాగే దసరా శరన్నవరాత్రులను పురస్కరించుకొని ఆర్యపాక్కంలోని శ్రీ విద్యా రంభ జ్ఞాన మహా సరస్వతి ఆలయంలో ఈనెల 29వ తేదీన ఒక్కొక్క దేవతకు ఒక్కో వృక్షం అంటూ తొమ్మిది రకాల ఔషధ మొక్కలను నాటనున్నట్లు తెలిపారు .ఈ కార్యక్రమంలో ఊరా శశికళతోపాటు వైజయంతి, మల్లికాబద్రీనాథ్, ఉమాగుప్తా, నీరజా వసంత్, మల్లికా ప్రకాష్, సుమతి,నంద, రజిని , జయశ్రీ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సాయం అందుకున్న చిరు వ్యాపారులు తమిళనాడు ఆర్యవైశ్య మహిళ సభ కార్యవర్గానికి ధన్యవాదాలు తెలియజేశారు
…


More Stories
‘Drug Free Tamil Nadu 1000 people participated in the Grand human chain rally.
శోభా రాజా నివాసంలో వైభవంగా వరలక్ష్మీ పూజలు
கோவையை அதிர விடும் போதைப்பொருள் மன்னன்… ஆளும் கட்சி ஆதரவில் அட்டூழியமா? – யார் இந்த அரவிந்த்?