
చెన్నై న్యూస్:ఎ బ్యాడ్ రోబోట్ ప్రొడక్షన్, ఎ జాక్సన్ పిక్చర్స్ ప్రొడక్షన్, ఎ డేవిడ్ రాబర్ట్ మిచెల్ ఫిల్మ్ ఆధ్వర్యంలో ‘ది ఎండ్ ఆఫ్ ఓక్ స్ట్రీట్’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి సంబంధించిన ట్రైలర్ వచ్చేసింది..ప్రేక్షకులను ఈ ట్రైలర్ మంత్రముగ్ధులను చేస్తూ ఆకట్టుకుంటుంది.
ఈ చిత్రాన్ని వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేయనుంది. భారతదేశంలో ఆగస్టు 2026లో కేవలం సినిమా హాళ్లు, ఐమాక్స్‌లో మాత్రమే విడుదలకు సిద్దమవుతోంది. యాన్ హాతవే, ఇవాన్ మెక్‌గ్రెగర్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రంలో మైసీ స్టెల్లా, క్రిస్టియన్ కాన్వెరీ కూడా నటించారు. ఈ చిత్రానికి డేవిడ్ రాబర్ట్ మిచెల్ రచన, దర్శకత్వం వహించగా, జె.జె. అబ్రామ్స్, హన్నా మింగెల్లా, జాన్ కోహెన్, డేవిడ్ రాబర్ట్ మిచెల్, మాట్ జాక్సన్, టామీ హార్పర్ నిర్మించారు.
మిచెల్ బృందంలో సినిమాటోగ్రాఫర్ మైఖేల్ గియోలాకిస్, ప్రొడక్షన్ డిజైనర్ మాయా షిమోగుచి, ఎడిటర్ జాన్ ఆక్సెల్‌రాడ్, సంగీత దర్శకుడు మైఖేల్ గియాచినో ,ఇంకా కాస్ట్యూమ్ డిజైనర్ ఎరిన్ బెనాచ్ ఉన్నారు.
అసక్తికరంగా ది ఎండ్ ఆఫ్ ఓక్ స్ట్రీట్ : ఒక రహస్యమైన ఖగోళ సంఘటన ఓక్ స్ట్రీట్‌ను శివారు ప్రాంతం నుండి వేరు చేసి, వారి నివాస ప్రాంతాన్ని తెలియని ప్రదేశానికి తరలిస్తుంది. ఈ నేపథ్యంలో ఓక్ స్ట్రీట్‌కి చెందిన ప్లాట్ కుటుంబం గుర్తుపట్టలేని పరిసరాలలో ప్రయాణిస్తూనే ఉన్నప్పటికీ ఐకమత్యంగా ఉండటాన్ని గమనిస్తారు. ఈ ఐకమత్యంతో వారెలాంటి ప్రయాణం చేశారు?, చివరికి ఏమైంది అనేది ఆద్యంతం ఆసక్తికరమని మేకర్స్ చెబుతున్నారు


More Stories
Sun TV Network Enters the Micro-Drama Space with Sun NXT Shorts for Mobile and TV
Top Triathletes Crowned at the 2026 TTA State Triathlon Championship in Chennai
மதுரை ஆர். முரளிதரனின் ‘மருதிருவர்’ நாட்டிய நாடகம் சென்னையில் அரங்கேற்றம்!