December 17, 2024

ఆంధ్ర కళా స్రవంతి ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజనాల మహోత్సవం

చెన్నై న్యూస్ : ఆంధ్ర కళా స్రవంతి ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజనాల మహోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఆంధ్ర కళా స్రవంతి సభ్యులు ,వారి కుటుంబాలు,తెలుగు ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎంతో ఆహ్లాదకరంగా గడిపారు ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజలను మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో చేసి వేడుకున్నారు అలాగే గోమాతను పూజించి ఆశీస్సులను అందుకున్నారు.ఆంధ్ర కళా స్రవంతి అధ్యక్షుడు జె ఎం నాయుడు అధ్యక్షతన ఈ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏడాది ఆంధ్ర కళా స్రవంతి ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజనాల మహోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా డిసెంబర్ 10 వ తేదీ ఆదివారం తలసా సాంప్రదాయ వ్యవసాయ క్షేత్రమైన కనకమ్మ సత్రములో ఈ కార్తీక మాస వనభోజన మహోత్సవాలను నిర్వహించారు. అక్కడ ముందుగా పండితులు సుసర్ల కుటుంబ శాస్త్రి బృందం చే ఉసిరి చెట్టుకు పూజలు చేశారు. ఉసిరి చెట్టు దగ్గర శివుడు, విష్ణు, అమ్మ వార్లు తో శ్రీ లక్ష్మి పూజ, గో పూజ ,జల పూజలను దాదాపు100 మంది పైగా ముతైదువులు పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలను చేసి ఆశీస్సులు పొందుకున్నారు.పూజల అనంతరం పిల్లలు, స్త్రీలు పలు ఆట పాటల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. ఈ వేడుకల్లో ఈ వ్యవసాయ క్షేత్ర యజమాన్యం చలపతి దంపతులు, మునిరత్నం నాయుడులకు స్రవంతి కమిటీ తరపున అధ్యక్షులు జె ఎం నాయుడు ధన్యవాదాలు తెలియజేశారు.చల్లటి వాతావరణంలో ఆహ్లాదకర ప్రదేశములో ఎంతో ఆనందంగా గడపటంతో పాటుగా ఆంధ్ర రుచులతో భోజనాలు అందించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ అధికారులు పాల్గొని ఆంధ్ర కళా స్రవంతి చేస్తున్న సేవా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రసంశలు
అందించారు.ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు కుమార్, సురేంద్ర, మనోహర్ లు జయప్రదముగా అన్ని ఏర్లాట్లుకు స్రవంతి అధ్యక్షులు జె ఎం నాయుడుకు సహకరించారు.

About Author