చెన్నై న్యూస్: సీనియర్ సిటిజన్ల సేవలు సమాజానికి ఎంతో అవసరం అని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ (వామ్) గ్లోబల్ అధ్యక్షులు తంగుటూరి రామకష్ణ అభివర్ణించారు. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ సీనియర్ సిటిజన్స్ ఫోరం –తమిళనాడు, వామ్ గ్రేటర్ చెన్నై, వామ్ మహిళా విభాగ్, వలసర వాక్కం ఆర్యవైశ్య అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో తొలిసారిగా ’సీనియర్ సిటిజన్స్ గలా మీట్ 2024 ’పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. చెన్నై పుదుపేటలోని నాదముని హాలు వేదికగా ఆదివారం వైభవంగా జరిగింది. ముఖ్యఅతిథిగా వామ్ గ్లోబల్ అధ్యక్షులు తంగుటూరి రామకష్ణ, విశిష్ట అతిథులుగా అజంతా గ్రూప్ అధినేత డాక్టర్ కనిగెలుపుల శంకరరావు, వామ్ గ్లోబల్ సలహాదారు టి. రాజశేఖర్ పాల్గొన్నారు. సభకు అధ్యక్షత వహించిన సీనియర్ సిటిజన్స్ ఫోరం అధ్యక్షులు విఎన్ హరినాథ్ స్వాగతం పలుకుతూ వయోజనులకు అడపా తడపా పలు కార్యక్రమాలు నిర్వహించి బహుమతులతో ప్రోత్సహించాలని లక్ష్యంతో నూతన శాఖను ప్రారంభించామని తెలిపారు. ఉపాధ్యక్షులు జి రాధాకష్ణ అతిథి పరిచయం చేశారు. సీనియర్ సిటిజన్ ల ఆరోగ్య జీవనానికి అవసరమైన ఎన్ ఆర్ బి ముద్రలను రమేష్ వివరించారు. అనంతరం ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్‌లకు క్విజ్, సంగీత పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. కోశాధికారి ఎం జగదీష్ వందన సమర్పణ చేశారు. సంయుక్త కార్యదర్శి A. సుధాకర్ వ్యాఖ్యాతగా వ్యవహరించి కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించారు. రాణి హరినాథ్‌తోపాటుగా మహాసభ గ్రేటర్ చెన్నై విభాగ్ అధ్యక్షులు బెల్లంకొండ సాంబశివరావు,
మహిళా విభాగ్ అధ్యక్షురాలు శ్రీలత ఉపేంద్ర , వలసరవాక్కం ఆర్యవైశ్య అసోసియేషన్ అధ్యక్షుడు K.నారాయణన్, సభ్యులు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
More Stories
సూర్యకాంతం నటన అనితరసాథ్యం- నటి పద్మిని వ్యాఖ్య
உலக தியான தினம் குறித்த முக்கிய உரை நாளை இந்திய நேரப்படி இரவு எட்டு மணி அளவில் நிகழ்த்த உள்ளது
NATIONAL OPEN ROTARY PARA TABLE TENNIS TOURNAMENT – SEASON3