చెన్నై న్యూస్ : వరాలిచ్చే మహాలక్ష్మి మమ్మల్ని చల్లగా చూసి.. వరాలు ఇమ్మని వేడుకుంటూ వరలక్ష్మీ పూజను అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా తెలుగు భాషాభిమాని,ఐకాస్ టెక్నాలజీస్ డైరెక్టర్ శోభారాజా నేతృత్వంలో అన్నానగర్ లో ఉన్న శోభారాజా వైకుంఠ నిలయంలో వరలక్ష్మి వ్రతం పూజలు శాస్త్రోక్తంగా చేపట్టారు .వరలక్ష్మీ అమ్మవారిని భక్తిశ్రద్ధలతో కొలిచారు. ముందుగా వైకుంఠ నిలయాన్ని ముగ్గులతో, మామిడితోరణాలతో శోభాయమానంగా అలంకరించారు.అలాగే వివిధ రకాల పుష్పాలతో వరలక్ష్మి అమ్మవారిని నేత్రపర్వంగా అలంకరించి పూజలు చేశారు. ఈ పూజల్లో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని వరలక్ష్మీ అమ్మవారి కృపకుపాత్రులయ్యారు.

ముత్తైదువులందరికి నోము తోరం కట్టి శోభారాజా గారు దీవించారు.పూజల్లో పాల్గొన్న వారందరికీ తాంబూలం, ప్రసాదాలను అందజేశారు. సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో , పది కాలాల పాటు సుమంగళిగా ఉండే విధంగా అమ్మవారిని వేడుకున్నారు.ఈ వేడుకలో సంగీత దర్శకులు డాక్టర్ శ్రీనిబాబు వరలక్ష్మి అమ్మవారిని కీర్తిస్తూ భక్తిపాటలను అలపించి ఆధ్యాత్మిక శోభను తెచ్చారు.ఈ వేడుకలో శోభారాజా కుటుంబ సభ్యులు ఐకాస్ టెక్నాలజీస్ మేనేజర్ (కువైట్) సి వి రాజా, డైరెక్టర్ ప్రవీణ్ రాజా ,దంతవైద్య నిపుణులు సునీత రాజా, అగర్వాల్ మేనేజర్ కిరణ్ రాజు, రేష్మి ,గలాట్టా ఎడిటర్ శక్తి గిరీస్, టీవీ న్యూస్ రీడర్ సెన్ తమిళ్ అరసు,దేవి కృష్ణ,గాయని అరుణ, రమాదేవి, వాణి, దాక్షా రఘునాధ్,ఆర్యపాక్కం శ్రీవిద్యారంభ మహా సరస్వతి ఆలయం ధర్మకర్త మనిమాలరావు, తదితర ప్రముఖులు పాల్గొని వరలక్ష్మి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.
..


More Stories
‘Drug Free Tamil Nadu 1000 people participated in the Grand human chain rally.
శోభా రాజా నివాసంలో వైభవంగా వరలక్ష్మీ పూజలు
கோவையை அதிர விடும் போதைப்பொருள் மன்னன்… ஆளும் கட்சி ஆதரவில் அட்டூழியமா? – யார் இந்த அரவிந்த்?